రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో భారత రాజ్యాంగ దినోత్సవ 75వ సంవత్సర వేడుకలు మంగళవారం ఉండ్రాజవరం మండలంలో మండల పరిషత్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయాల నుండి పంచాయతీ కార్యాలయాల వరకు, అన్ని పాఠశాలలలోనూ వేడుకలు నిర్వహించారు. తాడిపర్రు అమృత సరోవర్ చెరువు వద్ద ఎంపీడీవో వి.వి.వి. రామారావు ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బి.ఆర్.అంబేద్కర్, మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలంగి గ్రామపంచాయితీలో గ్రామసర్పంచ్ బొక్కా శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ఎం. డి. హసన్ జానీ ఆధ్వర్యంలో హెల్త్ క్లస్టర్ ఇంచార్జ్ కాపా నాగరాజు, ప్రజలలో రాజ్యాంగస్ఫూర్తిని నింపేందుకు సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.