అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం అత్తిలి భవిత సెంటర్ లో చదువుతున్న వికలాంగులైన పిల్లలకు యూటీఎఫ్ అత్తిలి మండల శాఖ తరపున అభ్యసన సామాగ్రి మరియు రిఫ్రెష్మెంట్స్ గిఫ్ట్ ప్యాక్ అందిస్తున్న దృశ్యాలు. అత్తిలి మండల ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మరియు కేడర్ సభ్యుల ఆర్థిక సహకారంతో వికలాంగులైన బాల బాలికలకు అందించిన చిరుకానుకలు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్. నాగ శిరోమణి ఫైవ్ స్టార్ చాక్లెట్లు, హల్దీరాం హాట్ మిక్చర్ ప్యాకెట్లు, యుటిఎఫ్ జిల్లా ఆడిట్ నెంబర్ ఎం వి.వి.ఎస్.ఆర్ రాజేశ్వరరావు నా బట్టి చాక్లెట్ ప్యాక్ గుడ్ డే బిస్కెట్ ప్యాక్, యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఏ. అప్పలరాజు పూతరేకులు స్వీట్ బాక్స్, మండల కోశాధికారి వీ. దుర్గాబాబు పెన్సిల్ బాక్స్, మండల కార్యదర్శి కే.లావణ్య నాప్కిన్స్, మండల కార్యదర్శి షేక్ నాగోల్ మీరా బ్రిటానియా మేరీ బిస్కెట్ ప్యాక్, మండల కార్యదర్శి హెచ్.రమేష్ ఫ్రూట్ కేకులు, అత్తిలి మండల యుటిఎఫ్ శాఖ తరపున పిల్లలందరికీ డూమ్మ్స్ పెన్సిల్ కిట్, ఒక ప్యాక్ రూపంలో తయారుచేసి పిల్లలకు అందించడం జరిగిందని ఉపాధ్యాయులు తెలియజేశారు.