ప్రపంచ వికలాంగుల దినోత్సవం

ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా తణుకు భవిత కేంద్రంలో లీగల్ సర్వీసెస్ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి. సత్యవతి ఆదేశముల మేరకు న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు వికలాంగులకు వున్న చట్టాలు, హక్కులు గురించి తెలియచేస్తూ, అంగవికలురు అయినప్పటికీ గిన్నిస్ బుక్ లో ఎక్కినవారు వున్నారని, ఎంతోమంది సైంటిస్ట్ లు వికలాంగులేనని, శారీరక, మానసిక వికలాంగులకు ప్రభుత్వం వారికి అన్ని రంగాలలో చేయూత ఇస్తుందని, వికలాంగుల పిల్లలను తల్లితండ్రులు ప్రోత్సహించాలని, దానిద్వారా వారికి ఆత్మస్థయిర్యం వస్తుందని, మండల న్యాయసేవల కమిటీ ద్వారా ఆస్తి విషయాలలో, అరోగ్య విషయాలలో చట్టప్రకారం న్యాయసహాయం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కోలా కనకదుర్గభవాని, ఏ. అజయ్ కుమార్, పారా లీగల్ వాలంటీర్లు కె.నాగమల్లేశ్వరి, శ్రీదేవి స్కూల్ ఇన్చార్జి లు కె.వి. చంద్రశేఖర్, వి.పద్మావతి, విద్యాశాఖాధికారి వి.హైమవతి, జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మిస్ట్రెస్ కె. పద్మావతి, ముప్పిడి అనిలకుమారి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top