తణుకు పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి కారుమూరి : తణుకు మండలం తేతలి గ్రామంలో లేహం ఫుడ్ ప్రోడక్ట్ పేరుతో గో – పశువధ కర్మాగారం వెంటనే ఆపాలి. ఆ పశువధ కర్మాగారానికి 2014-2019మధ్యలో టీడీపీ హయాంలో అనుమతులు ఇచ్చారు. రోజుకి 400 పశువులును వదించే విధంగా దారుణమైన అనుమతులిచ్చారు. 2019 నుండి వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పశువధ కర్మాగారాన్ని ఆపించేసాను, అన్ని అనుమతులు రద్దు చేయించాము, ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది పశువధ కర్మాగారం తిరిగి గోవుల్ని వదించటం మొదలు పెట్టేసారు, ఇలాంటి కర్మాగారాలు నడవకూడదు ప్రక్రుతి కలుషితం అవుతుంది, వేలాది పశువుల్ని గోవుల్ని వధించిన నెత్తిరు మా పచ్చటి నేలలో కలిస్తే తరువాత తరాలకు అరిష్టం, తీవ్ర దుర్గంధంతో చుట్టూ పక్కల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిడదవోలు ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ ని, స్థానిక ఎమ్మెల్యే అరిమిల్లికి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజాశ్రేయస్సుకు హాని కలిగించే ఇలాంటి జీవహింస మన పరిసరాల్లో జరగకుండా చూడాలి. ఇప్పుడు మా విజ్ఞప్తికి స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలి లేదంటే త్వరలో ప్రజలను కలుపుకొని ఉద్యమిస్తాం.