విద్యతోనే యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి

విద్యతోనే యువతకు అపార ఉపాధి అవకాశాలు. ఘనంగా ఈవెన్ గ్లోబ్ సెంటర్ ప్రారంభం విదేశాలలో ఉన్నతవిద్యకు ఉచిత సదుపాయం. గంట్ల // ఉన్నత విద్యతో యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయము సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. ఈ మేరకు మంగళవారం ద్వారకా నగర్ లోని రెండో లైన్లో ఈవెన్ గ్లోబ్ నూతన సెంటర్ ను శ్రీనుబాబు ముఖ్య అతిధి గా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ ప్రభుత్వాలపై ఆధారపడకుండా యువత సొంతంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడం అభినందనీయమన్నారు. ఈవెన్ గ్లోబ్ సెంటర్ కి ఇప్పటికే పేరు ప్రతిష్టలు ఉన్నాయని భవిష్యత్తులో ఇది మరింతగా సేవలందించాలని శ్రీను బాబు ఆకాంక్షించారు. ఈవెన్ గ్లోబ్ మేనేజింగ్ డైరెక్టర్ చిక్కాల యశ్వంత్ మాట్లాడుతూ తమ సంస్థకు ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ తో పాటు విదేశాల్లో కూడా పలు బ్రాంచ్ లు ఉన్నాయన్నారు. ప్రధానంగా అమెరికా యూకే, ఆస్ట్రేలియా,కెనడా, యూరప్ దేశాల్లో తమ సంస్థకు 11000 యూనివర్సిటీలతో (టైఅప్) భాగస్వామ్యం కలిగి ఉన్నామన్నారు. దీనివల్ల విదేశాల్లో విద్యనభ్య సించాలని భావించిన విద్యార్థులకు వారు కోరుకున్న కళాశాల లో ప్రవేశము, రుణం మంజూరు, వీసా ప్రాసెస్ లు అన్నీ ఉచితంగానే సేవలందిస్తామన్నారు. ఆయా దేశాల్లో కూడా తమకు బ్రాంచ్ లు ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మిస్టర్ ఇండియా విన్నర్ మోడల్. లియాన్. తులసి కార్తీక్ పలువురు యువత పాల్గొన్నారు.

Scroll to Top