అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు (సోంబాబు) పదవీ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమం సందర్భంగా, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి టి. నిశాంతి అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడుతో ప్రమాణ స్వీకారo చేయించారు. ఈ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న, డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇంచార్జ్ మంత్రి, వ్యవసాయశాఖ మంత్రివర్యులు కింజారపు అచ్చెన్నాయుడు మరియు మాజీ మంత్రి, టీడిపి పాలిట్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, కార్మికశాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, ముమ్మిడివరం దాట్ల బుచ్చిబాబు, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి అధ్యక్షులు యళ్ళ దొరబాబు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.