ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఢిల్లీ బాబు రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి వాల్మీకి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం.లత ఆధ్వర్యంలో (ఏపీఎంఫ్ ) మహిళా కార్యవర్గం ఎన్నుకోబడింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వాల్మీకి నాగరాజు మాట్లాడుతు సమాజంలో సామాన్య మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏపీఎమ్ఎఫ్ మహిళా కార్యవర్గానికి తెలియజేస్తే తక్షణ పరిష్కారం జరుగుతుందని. ఇంతవరకు ఏ జిల్లాలో లేని విధంగా మహిళ జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని వారికి సముచిత స్థానం కల్పించడానికి సమస్యలపై పోరాటం చేయడానికి మహిళా జర్నలిస్టులు ఏమాత్రం తక్కువ కాదని అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యవర్గం ఎన్నుకోబడినది మహిళలందరూ ఫెడరేషన్ అభివృద్ధికి కృషి చేయాలని జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా సభ్యులందరూ కలిసి పోరాడాలని అందరూ కలిసి మెలిసి ఉండాలని తెలియజేస్తూ కార్యవర్గంలో ఎన్నికైన మహిళా జర్నలిస్టులకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చక్రవర్తి, సురేష్, ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, మరియు మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా మహిళా కార్యవర్గ సభ్యులు అధ్యక్షురాలుగా వరలక్ష్మి, కార్యదర్శిగా అనుపమ యాదవ్, ఉపాధ్యక్షురాలుగా మీనా, సహాయక కార్యదర్శిగా ఉమా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శారా, కార్యవర్గ సభ్యులుగా విజయ, రేణుక, జయశ్రీ, నిషా, శైలజ, రషీదా భేగం ని ఎన్నుకోవడం జరిగింది.