పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల రెడ్డి జన్మదినం సందర్బంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం మల్కాపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజక వర్గ ఇన్చార్జి కేవీ సూర్యనారాయణ ఆద్వర్యంలో వై.ఎస్ షర్మిల రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియచేసారు. స్థానికులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో సీనియర్ నేతలు నూకరాజు, ఎర్రయ్య, రజియాబేఘం, మున్నా, వార్డ్ ప్రెసిడెంట్స్, కార్యకర్తలు, పాల్గొన్నారు.
