అత్తిలిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
న్యూఢిల్లీలో నోయిడాలో సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో విఐపి క్యాడర్ గ్రేటర్ నోయిడాలో ఏఎస్సైగా పనిచేస్తున్న అత్తిలి గ్రామానికి చెందిన నేలపాటి జ్యోతికుమారి(56) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. గతంలో సిఆర్పిఎఫ్ 213(M)BN మరియు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ 100(M)BN లో కూడా పనిచేశారు. ఢిల్లీ నుంచి విమానంలో ఆమె మృతదేహం గన్నవరం ఎయిర్పోర్టుకు సోమవారం ఉదయానికి చేరుకుంది. రాజమండ్రి నుంచి వెళ్లిన సీఆర్పీఎఫ్ జవాన్లు గన్నవరం నుండి ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చారు. జ్యోతికుమారి వివాహానికి ముందే సీఆర్పీఎఫ్ ఉద్యోగంలో చేరారు. ఈమె భర్త జాన్ మోషే తణుకు కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. మరో నాలుగేళ్లు సర్వీసు ఉండగా హఠాన్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. సిఆర్పిఎఫ్ వాహనంలో జ్యోతికుమారి మృతదేహాన్ని తణుకు నుంచి అత్తిలి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు భారీ ఊరేగింపుగా తీసుకువచ్చారు. సీఆర్పీఎఫ్ జవాన్లు సైనిక వందనం చేసి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరిపారు. పెద్ద సంఖ్యలో స్థానిక యువత, గ్రామస్తులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.