ఆదివారం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా తణుకు జాతీయ గ్రంధాలయంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వావిలాల సరళదేవి, కౌరు వెంకటేశ్వర్లు పొట్టి శ్రీరాములుచిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగినది. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆంధ్రరాష్ట్ర అవతరణ కొరకు ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గురించి మాట్లాడించడం జరిగింది. అనంతరం గ్రంధాలయంలో చదవడం నాకిష్టం కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన, వకృత్వము, క్విజ్, పోటీలు నిర్వహించి, ఈ సందర్భంగా విద్యార్థులకు పెన్నులు బహుకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జి.ఉష, ఎన్ ఎస్ ఎం లక్ష్మీ, గ్రంథాలయ అధికారి కే.సుగుణకుమారి పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
