కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కరెంట్ బిల్లులు పెంచము నాణ్యమైన కరెంటు అందిస్తాం అని చెప్పిన కూటమి నాయకులు నేడు 15,485 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నెత్తిన పెట్టారు అని రాష్ట్ర మాజీ పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా తణుకు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు అంటూ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా కాలం వెళ్లబుచ్చుతున్నారని అన్నారు. సూపర్ బాదుడే బాదుడు అనే కార్యక్రమం చేపట్టారని కారుమూరి అన్నారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అనే పథకాన్ని నీరుగార్చిన కూటమి ప్రభుత్వం వారి పైన కూడా కరెంట్ బిల్లులు చార్జీల రూపంలో 15485 కోట్లు వసూలు చేస్తున్నారని అన్నారు. ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కోటమీ ప్రభుత్వం నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపొగా ప్రజలకు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి గాలికి కొట్టుకుపోయాయి అనే విమర్శించారు. కరెంటు చార్జీలు పెంచే ప్రసక్తి లేదు అవసరమైతే చార్జీలు తగ్గిస్తాం అని పులివెందులలో ఇచ్చిన మాట వాస్తవం కాదా అని కారుమూరి అన్నారు. వైజాగ్ రాజమండ్రి ప్రతి ప్రాంతంలోనూ ఎన్నిక సభలలో ఇచ్చిన మాట హామీలు ఏమయ్యాయి, ఎన్నో హామీలు గుప్పించిన కూటమి నాయకులు ఏమయ్యారు అన్నారు. చార్జీల పేరుతో సూపర్ బాదుడే బాదుడుగా ఉందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములను జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేస్తాడని దస్తావేజులు ఉండవని జిరాక్స్ కాపీలు మాత్రమే ఉంటాయని చెప్పిన కూటమి నాయకులు నేడు పేరు మార్చి అదే పని చేస్తున్నారని, ఇదేనా మీరు చేసిన నయవంచన ప్రజలను అని కారుమూరి అన్నారు. సూపర్ సిక్స్ ద్వారా పేదవాడిని ధనవంతుడిని చేస్తాం, పేదవాడిని లక్షాధికారిగా ఎలా చేయాలో నాకు తెలుసు అని చెప్పిన చంద్రబాబునాయుడు నేడు పేదవారిని నిరుపేదగా మారుస్తున్నారని అన్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులు, రజకులు, నాయిబ్రాహ్మణులు తదితర ప్రజలకు అధికారంలో అండగా నిలిచిన వైసిపి ప్రభుత్వం, నేడు కనీస పథకాలు అందక పిల్లలను చదివించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వ పాలన దారుణాతి దారుణంగా, ఘోరంగా ఉందని అన్నారు. ప్రజల యొక్క రక్త మాంసాలను పిండి వాటి ద్వారా సంపద సృష్టిస్తున్నారా అని అన్నారు. నోరు ఎత్తితే కేసులు పెడుతున్నారని ఎన్నాళ్లు ఈ విధంగా పెడతారు, ఎంతమందిని అరెస్టులు చేసి, ఎంతమందిపై కేసులు పెట్టి నిర్బంధిస్తారు అని అన్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి వ్యక్తికి మాట్లాడే వాక్ స్వాతంత్రపు హక్కు ఉందని ఆయన అన్నారు. బ్రిటిష్ వారి సమయంలోను ఎమర్జెన్సీ సమయంలో కూడా ఈ విధంగా లేదని అన్నారు. ఈరోజు కూటమి నాయకులు ప్రజల మధ్యకు వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి కరెంటు చార్జీల విషయంలో డిసెంబర్ 27వ తేదీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారని అన్నారు. శాంతియుత ర్యాలీ ద్వారా విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు.
