2024, డిసెంబర్ 14వతేది శనివారం జాతీయ లోక్ అదాలత్

4వ అదనపు జిల్లా జడ్జికోర్టు హాలు, తణుకు., సబ్ జైల్, తణుకు. జిల్లా న్యాయ సేవాదికార సంస్థ సెక్రటరీ/సీనియర్ సివిల్ జడ్జి కె. రత్న ప్రసాద్ తణుకు న్యాయమూర్తులతో మరియు తణుకు కోర్టు పరిధిలో పనిచేయు పోలీసు అధికారులతో 2024, డిసెంబర్ 14వతేది శనివారం జరిగే జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడు క్రిమినల్ కేసులు రాజీచేయుట గురించి మాట్లాడి యెక్కువ కేసులు రాజీచెయ్యాలని తెలిపారు. తరవాత సబ్ జైల్ తణుకు ను సందర్శించి అందులో వున్న ముద్దాయిల కేసువివరాలు అడిగి తెలుసుకుని, ప్రతి ఒక్కరూ న్యాయవాది కలిగి ఉండాలన్నారు. లేని వారికి వారి ఆర్థిక స్తోమతనీ పరిశీలించి ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే శిక్షపడిన ముద్దాయిలకు అప్పీల్ చేసుకొనుటకు కూడా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముద్దాయిలకు అందుచున్న ఆహారవసతి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు చైర్మన్ & నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి పొతర్లంక సాయిరామ్, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఏ.వి. నాగరాజు, బెంచ్ కోర్టు మెజిస్ట్రేట్ తాడీ ఆంజనేయులు, తణుకు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, అత్తిలి సబ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ రాజ్ , లైసనింగ్ ఆఫీసర్ కృష్ణమూర్తి, ఇతర పోలీసు సిబ్బంది, జైల్ సూపరింటెండెంట్ జి. మోహనరావు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link