ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర డైరీని సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి(ఎన్‌ఎజె) కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ అర్బన్ అధ్యక్షుడు పి.నారాయణ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఈ సందర్భంగా డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జర్నలిస్టుల సంఘం నాయకులు గంట్ల శ్రీనుబాబు, పి.నారాయణలు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా రాష్ట్ర కార్యవర్గం పూర్తిస్ధాయి సమాచారంతో డైరీని ప్రచురించడం జరిగిందన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు మరోసారి పూర్తిస్థాయిలో తెలియజేస్తామన్నారు. ప్రధానంగా జర్నలిస్టులకు సంబంధించిన కమిటీల్లో సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, అలాగే ప్రమాద బీమా పాలసీని పునురుద్దరించాలని, తక్షణమే ఇళ్ల స్ధలాలు కేటాయించాలని, జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల మాదిరిగానే షెన్షన్ సదుపాయాన్ని కల్పించాలని కోరనున్నట్లు వీరు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యదర్శి జి.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు రామకృష్ణ, పిల్లా నగేష్ బాబు,స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కార్యదర్శి కెవి శర్మ, జాయింట్ సెక్రటర్లు రవిశంకర్, రాజశేఖర్, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ కార్యదర్శి కె.మధన్, సభ్యులు శ్రీలత, రేణుక పట్నాయక్, సతీష్‌బాబు, గోపి నాధ్ లతో పాటు పలువరు పాత్రికేయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
