తణుకు ఎన్ టి ఆర్ పార్క్ వద్ద వున్న ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహదాతలు అయిన వావిలాల వెంకట రమేష్, సరళాదేవి దంపతుల ఆధ్వర్యంలో ఘంటసాల 51వ వర్ధంతి సందర్భంగా నివాళులు సమర్పించారు.
తొలుత వావిలాల పవన్ కుమార్, ఆర్కెస్ట్రా రాజు విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.
అనంతరం సరళాదేవి దంపతులు, కడియాల సూర్య నారాయణ,చివటం సుబ్బారావు పూలతో ఆయనకు నివాళులు సమర్పించారు.
ఈ సందర్భంగా సరళాదేవి ఘంటసాల జీవితచరిత్ర ను వివరిస్తూ నేటి గాయకులు ఆయన జీవితచరిత్రను తెలుసుకోవాలని, ఆయన సంగీతం నాయకులే కాకుండా దేశభక్తితో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది అని ఎందరినో సినీ గాయకులుగా అవటానికి ఆర్థికంగా సామాజికంగా సహాయ సహకారాలు అందచేసిన గొప్ప గాన గంధర్వుడు అని ఆయన తెలుగువారి గా పుట్టడం మన అదృష్టమని తెలియపరిచారు. అనంతరం సింగర్ రాజు, సుబ్బారావు, కడియాల సూర్య నారాయణ తదితరులు ఘంటసాల గేయాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో గాయకులు ఎమ్. విజయ్ కుమార్, ఎ.భాస్కర్, కె.శేఖర్, కె.శ్యామల, ఎమ్.ఉమాజ్యోతి, కె.సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
