గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రాలను పరిశీలించిన జిల్లాకలెక్టర్ పీ.ప్రశాంతి

బుధవారం సాయంత్రం పెరవలి మండలం పెరవలి గ్రామంలో ఎంపీపీ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి తో కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు కే. సునీత పరిశీలించడం జరిగింది.

పోలింగ్ జరిగే రోజున ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ఖచ్చితంగా పాటించాలని ఎన్నికల పరిశీలకులు కే. సునీత సూచించారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నందున, సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఓటర్ స్లిప్స్ జారీ, ఇతర పోలింగ్ సామగ్రిని ముందస్తుగా తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ బూత్ ను పరిశీలించి సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఫిబ్రవరి 27 వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను వివరించడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కు చెందిన సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గా జిల్లా రెవిన్యూ అధికారి టి. సీతారామ మూర్తి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 82 పోలింగ్ కేంద్రాలను, 10 యాక్సెలరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. సార్వత్రిక ఎన్నికల మార్గదర్శకాలు ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి, ఆర్డీవో రాణి సుస్మిత, పెరవలి తహసిల్దార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link