జర్నలిస్టుల హక్కులు కాలరాస్తే చూస్తు ఊరుకోలేము
లీడర్ రమణమూర్తికి ఇచ్చిన నోటీసులు వెనక్కు తీసుకోవాలి
అధికారుల తీరు మారకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాము
టిజేఏఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి
ఒక పత్రిక మీద నిజాలు రాసే జర్నలిస్టు మీద ఆర్డీఓ అధికారి వాళ్ళకి పవర్ లేకపోయినా సరే బెదిరింపు ద్వారా మీడియాని కంట్రోల్ చేయాలని చూడటం బాధాకరమన్నారు టిజేఏఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి విజేఏఫ్ లో లీడర్ రమణ మూర్తికి ఇచ్చిన నోటీసులుకు వ్యతిరేకంగా వివిధ జర్నలిస్టుల సంఘాలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో టిజేఏఫ్ అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వాళ్ళు ఇచ్చిన నోటీసుకి వ్యతిరేకంగా ఇంత మంది జర్నలిస్టులు ఈరోజు మద్దతు గా రావడం మన ఐక్యత చాటుతుందన్నారు
రాబోయే రోజుల్లో కూడా మన మీద దాడి జరిగితే ఒకేసారి ఒక కూటమిగా ముందుకెళ్తారు అనే భావన అధికారులకి క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. గతంలో ఏదైనా ఒక వార్త రాస్తే ఆ వార్తకు కండనివ్వండి అని అధికారిగా మేము ఇబ్బంది పడుతున్నాం ఆపై అధికారులు దగ్గర మేము తలెత్తుకోలేకపోతున్నాం అని చెప్పి మాట్లాడే అధికారులు ఈరోజు మా ముందు నిలబడాలని హుకుం జారీ చేస్తున్నా పరిస్థితులు వస్తున్నాయి దీన్ని ఇలాగే మనం వదిలేస్తే రాబోయే రోజుల్లో వార్త రాయలేని పరిస్థితి ఒక ఛానల్ అయినా ఒక పేపర్ అయినా కచ్చితంగా మనకున్న పరిధిలో మనం నిలబడి వార్త రాసినప్పటికీ కూడా బెదిరింపులు భయపెట్టడాలు ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో చాలా ఎక్కువగా జరిగాయి మల్లీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలోనైనా అది మారుతుంది అనుకుంటే అదే కంటెన్యూ అవుతుంది అందుకే మన జర్నలిస్టులు అందరూ కూర్చొని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని వివరించారు భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపు నిచ్చారు జర్నలిస్టు పెద్దలు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే జర్నలిస్టుల కోసం పత్రికల కోసం ఛానల్స్ కోసం టీజేఎఫ్ ఎప్పుడూ నిలబడుతుందని హామీ ఇస్తున్నామని తెలిపారు.