ఉత్తర ప్రదేశ్ బరెల్లి కి చెందిన కళా రత్నం ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్ సొసైటీ వారు
ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆన్లైన్ గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్ మరియు కాంపిటీషన్ లో
ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు రెండు అవార్డులు సొంతం చేసుకున్నారు.
” కళా రత్నం అవార్డు ” తో పాటు “ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2024 “
అవార్డు ను ఆర్ట్ సొసైటీ నుంచి అందుకున్నానని వెంపటాపు బుధవారం తెలిపారు.
పోటీ మరియు ఆర్ట్ ఎగ్జిబిషన్లో వివిధ దేశాల చిత్రకారులు తమ తమ ప్రతిభను కనబరిచారని వెంపటాపు తెలిపారు.
అంతర్జాతీయంగా జరిగిన ఎగ్జిబిషన్లో రెండు అవార్డులు రావడంపట్ల వెంపటాపును
రచయిత, కళాకారుడు వాడ్రేవు సుందరరావు, కవి తాడినాడ భాస్కరరావు, చిత్రకళ ఉపాధ్యాయులు బొడ్డేటి శ్రీనివాస్, ఆర్ వి వి సత్యనారాయణ,
తణుకు పట్టణ ప్రముఖులు,
స్వగ్రామం ఇరగవరం ప్రముఖులు
మండల విద్యా శాఖధికారి శ్రీనివాస్, తంగిరాల గోపాల కృష్ణశర్మ , నీలిరోతు త్రిమూర్తులు , శిరిగినీడి నాగేశ్వరావు, పొన్నా రామకృష్ణ, యలమర్తి రాంబాబు తదితరులు అభినందించారు.