ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ని మెజారిటీతో గెలిపించాలని కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, జిల్లా జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలు పరిశీలకులు బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులైన ఎమ్మెల్సీ ఓటర్లను కలిసి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటును అందించి అఖండ విజయం చేకూర్చాలని బండారు శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లంక వరప్రసాద్, జనసేన పార్టీ నాయకులు సూరపురెడ్డి సత్య, సలాది జయప్రకాశ్ నారాయణ (జెపి), గారపాటి శ్రీనివాస్ చౌదరి, పడాల అమ్మిరాజు, బండారు బాబి, బావిశెట్టి తాతాజీ, తోట వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి మహేష్, తదితరులు పాల్గొన్నారు.
