- ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్
- లలిత సంగీతానికి జీవం పోసిన మహోన్నతవ్యక్తి బండారు చిట్టిబాబు మరణం సంగీత ప్రపంచానికే తీరని లోటని ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి చెన్నా తిరుమలరావు బుధవారం విడుదల చేసిన సంతాప ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. స్వతహాగా చిన్న తనంలోనే హార్మోనియం పట్టుకున్న బండారు ఆకాశవాణి ఏ -గ్రేడ్ కళాకారుడిగా ఎంతో మందికి సంగీత జీవితాన్ని ప్రసాధించారన్నారు. ఆకాశ వాణిలో వెయ్యికి పైగా లలిత గీతాలకు బాణీ లు సమకూర్చిన బండారు చిట్టిబాబు కళా ప్రవీణ వంటి ఎన్నో అవార్డులు అందుకున్న బండారు ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళంలో జన్మించడం సంతోషదాయకమన్నారు. ఎస్పీ బాలు పాడితే బండారు సంగీతం అందించిన అయ్యబాబోయ్ ఇక్కడున్నావా ఏడు కొండలెక్కి బాగ కూర్చున్నావా గీతం జనం మదిలో చిరస్తాయిగా నిలుస్తుంది.
