వరిపొలాలు కోతలకు సిద్దమవుతున్నవేళ ముందుగానే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్, మరియు డ్వాక్రా సంఘాల సమిష్టి ప్రణాళిక సిద్దంచేయడం కోసం ఏర్పాటుచేయబడిన సమావేశంలో ఎ.డి.ఏ. రమేష్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్దతులు పాటించడానికి రైతులకు ముందుగా నవధాన్యాల విత్తనాలు సమకూర్చి అందించడం చాలా ముఖ్యమైన అంశం గనుక ఈ మూడు టీమ్ లు కలసి పనిచేసి ప్రకృతి వ్యవసాయ ప్రగతిని సాదించాలని మన తణుకు డివిజన్ కు మంచిపేరు వచ్చేలా కృషి చెయ్యాలన్నారు. ఏ.పి.ఎమ్. రామకృష్ణ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్దతుల పట్ల ప్రతి మహిళకు అవగాహన కలిగి ఉండాలని కిచెన్ గార్డెన్స్, పెరటితోటలు,వేసుకుని రసాయన రహిత కూరగాయలు ఆకుకూరలు పండించడంలో ముందుండి సామూహిక ఇన్ పుట్స్ తయారీలో భాగస్వాములు కావడం ద్వారా రసాయన రహిత ఆకుకూరలు కూరగాయలు సమ్రృధ్ధిగా లభిస్తాయని తద్వారా మనజీవనవిధానంలో మార్పులురావడం, దీర్ఘకాలిక వ్యాధులకు గురికాకుండా ఉండటానికి తోడ్పడతాయని అందుకు కావలసిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వివరించారు.
ఎమ్.ఏ.ఓ. కుసుమకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానాలు ప్రతి రైతు వద్దకు చేరాలని రైతులలో అవైర్నెస్ తీసుకురావడంలో మనమంతా ముందుండి రైతులకు నవధాన్యాల సాగుపై అవగాహన కల్పించి ప్రతి రైతు నవధాన్యాలు చల్లేవిధంగా మన ప్లాన్ ఉండాలని సక్తివంచన లేకుండా పనిచెయ్యాలని వివరించారు. మెంటర్ మధుసూదనరావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్దతులలో మొదటి మెట్టు నవధాన్యాల సాగు ముప్పై రకాల విత్తనాలు వెయ్యడం వల్ల ఒకొక్క మొక్కయొక్క వేరు వ్యవస్థ ఒక్కోరకం పోషకాలను కలిగి ఉంటుంది గనుక ప్రధానపంటకు కావలసిన పోషకాలు నేలలో ఉండి ఎటువంటి ఎరువులు చెయ్యనవసరం లేకుండా పంటలు పండుతాయని చీడపీడలను ప్రధాన పంట తట్టుకో గలుగుతుంది మరియు రైతుకు లాభసాటి గామారుతుందని వివరించారు. ఎమ్.టి. వై.లక్ష్మి మాట్లాడుతూ ప్రక్రృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్న కూరగాయలకు ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉందని ప్రకృతి సిద్ధంగా పండించి మంచిలాభాలతో పాటు మంచి ఆరోగ్యాన్నికూడా పొందవచ్చని వివరించారు,
మండల ఇన్చార్జ్ షాలేంరాజు మాట్లాడుతూ పచ్చిరొట్టలు రైతులు వెయ్యడం వల్ల 365 రోజుల గ్రీన్ కవర్ చేసి ప్రకృతిని పరిరక్షించడంలో మనందరం ముఖ్య పాత్రవహించి భూతాపాన్ని తగ్గించిన వారమవుతామని భూమిలోని పంటకు కావలసిన సూక్ష్మజీవులు బ్రతికి ఉండాలంటే నవధాన్యాలు ప్రతి రైతుతో వెయ్యించాలని అందుకావలసిన ప్రణాళికలు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ వై నూకరాజు ఆదేశాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు, ఈ కార్యక్రమంలో మండల అగ్రికల్చర్ అధికారులు, డ్వాక్రా సి.సి.లు, యానిమేటర్లు, డ్వాక్రా ఓ.బి.లు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గున్నారు.
