త్రిభాషా విధానం హిందీ భాష పై జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన హిందీ భాష పై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రాధాన్యత సంతరించుకున్న సందర్భంలో వివిధ రాజకీయ సమకాలీక అంశాలపై పూర్తి అవగాహన కలిగిన ప్రముఖ మహిళ రాజకీయవేత్త బిజెపి నాయకురాలు తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేశారు.
చాలామంది రాజకీయ నాయకులు పవన్ కల్యాణ్ గారు త్రిభాషావిధానం, హిందీభాషపై మాట్లాదిన మాటలను వక్రీకరిస్తున్నారు. పాలసీలో ఒక ఇంగ్లీషు, రెండు స్థానిక భాషలు అన్నారు. అంటే ఎదైనా తమ స్థానిక భాషలను నేర్చుకోమన్నారు. బలవంతంగా హిందీభాషను నేర్చుకోమనలేదు. ఈ విషయంలో సినీనటులు ప్రకాష్ రాజ్, సమాజాన్ని ప్రభావితం చేసే కొంతమంది మాట్లాడుతున్నారు, అదేవిదంగా తెలంగాణా ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ఉదాహరణకు తమిళనాడును తీసుకుంటే తెలుగువారు నివసిస్తున్న ప్రాంతాలు అనేకం ఉన్నాయి, వారు తెలుగుతో పాటు తమిళం నేర్చుకోవచ్చు అంతేకానీ ప్రత్యేకించి హిందీ నేర్చుకోవాలని ఒత్తిడి లేదు, భారతీయ జనతా పార్టీ బలవంతంగా హిందీని తమ మీద రుద్దుతుందని ప్రజలలో సున్నితమైన అంశాన్ని సమస్యాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తు రాజకీయాలబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు అన్నారు. అదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో ప్రస్తావించడం జరిగిందని, ఆయన ఏ విషయంలోనైనా రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత లబ్ధి కోసం కాకుండా దేశ హితం రాష్ట్రహితం ప్రజాహితం కోసమే మాట్లాడారని అన్నారు. ఇటువంటి సున్నితమైన అంశాలలో మాట్లాడినప్పుడు జనసేన పార్టీకి ఇబ్బందికరమని తెలిసినా కూడా మనకు దేశం రాష్ట్రం ప్రాంతం ముఖ్యం అనే భావనతోటే మాట్లాడతారని అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై మాట్లాడుతూ ప్రజలకు ఇష్టమైన భాషను మాట్లాడుకుంటారని, భాషను నిర్ణయించుకునే హక్కు నేర్చుకునే విద్యార్థులకు ఉంటుందని ఆ హక్కును రాష్ట్ర ప్రభుత్వాలు వారికే ఇవ్వాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే పార్టీ మరల అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేకపోవడం చేత, రాజకీయ లబ్ధి కోసమే ఉత్తర దక్షిణ భారతదేశంలో అనే భావన తీసుకురావడం జరుగుతుందని, భారతీయ జనతా పార్టీ అంటే హిందీ భాష పార్టీ కాదని, ఆ భాషను ఎక్కువమంది మాట్లాడటం చేత, స్థానిక భాషలు కనుమరుగయ్యే ప్రమాదం హిందీ వల్ల ఉంటుందని కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. అదే ప్రమాదం స్థానిక భాషలకు హిందీ నుండి రావటం లేదని, ఇంగ్లీషు భాష నుండి ఆ ప్రమాదం పొంచి ఉందని, ఎక్కువమంది ప్రజలు ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నారనీ అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే హిందీ భాషను, జాతీయ విద్యా విధానాన్ని విమర్శిస్తూ, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను విమర్శిస్తే తమకు గుర్తింపు లభిస్తుందని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి నాయకురాలు డా. ముళ్ళపూడి రేణుక అన్నారు.