జ్ఞానాపురం ఫుట్ పాత్ లను ఆక్రమించిన రాజస్థాన్ వారిపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని, మరియు రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్డు పై ఉన్న కొంతమంది రాజస్థాన్ వ్యక్తులు పట్ల తగు చర్యలు తీసుకోవాలని 41 వార్డు టీడీపీ పార్టీ అధ్యక్షులు ఐతి మధుబాబు కంచరపాలెం పోలీసు స్టేషన్ సీఐ చంద్రరావు, ఎస్ ఐ సమీర్ కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆకతాయి ఆగడాలు, గంజాయి అమ్మకాలు మరియు స్కూల్స్ ప్రాంగణంలో అల్లరి మూకలు తిరగడం వళ్ళ స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురివుతున్నారని ఐతి మధు బాబు పోలీసులకు తెలపడం జరిగింది. ముఖ్యంగా రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు అసభ్యకరమైన ప్రవర్తన పట్ల, అలాగే ప్రజలపై వాళ్ళు చేస్తున్న దాడులు పై వివరించారు. రైల్వే స్టేషన్ కి వచ్చి, వెళ్ళే ప్రయాణికులను కూడా రాజస్థాన్ వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారని, పాదాచారులు ఉపయోగించే ఫుట్ పార్త్ సైతం వాళ్ళ జీవనోపాదికి ఉపయోగించుకుంటున్నారని స్థానిక పోలీసులకు జ్ఞానాపురం పై ఉక్కుపాదం మోపాలని విన్నపించారు. అలాగే రైల్వే పోలీసులతో మాట్లాడి చెక్ పోస్ట్ నిమ్మితమై ఉన్నత అధికారులతో మాట్లాడి కార్యాచరణ చేస్తామని సానుకూలంగా స్పందిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బూత్ ప్రెసిడెంట్, ఆటో డ్రైవర్స్, కార్యవర్గ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
