గౌరవ ఇన్చార్జి డిస్ట్రిక్ట్ జడ్జి ఎం. సునీల్ కుమార్, మరియు జిల్లా న్యాయ సేవాదికార సంస్థ ఏలూరు సెక్రటరీ కె. రత్నప్రసాద్ సబ్ జైల్ తణుకు ను ఆకస్మికంగా సందర్శించి అందులో వున్న రిమాండ్ ముద్దాయిలకు అందుచున్న ఆహార వసతి, వైద్యసదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముద్దాయిల కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరికయినా న్యాయవాదిని పెట్టుకునే ఆర్థికస్తోమత లేకపోతే వారి ఆర్థిక పరిస్థితిని పరిశీలించి మండల న్యాయసేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి అని, తప్పు చేసి నేరం అని తెలియదంటే చట్టం ఊరుకోదని, కష్టపడకుండా అక్రమంగా డబ్బు సంపాదించటం నేరమని, నేర ప్రవృత్తి మానుకోవాలని తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసుకోవాలని తెలిపారు. ఇందులో న్యాయమూర్తులు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి డి. సత్యవతి , సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె. కృష్ణ సత్యలత, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సాయిరాం పొతర్లంక మరియు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్, బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు.
