కానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ గా పని చేస్తున్న కె. వి నాగేశ్వరరావు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈమేరకు జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు పురస్కారాన్ని అందుకున్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావును తోటి సిబ్బంది, అధికారులు అభినందించారు
