మార్చి 20- 24 తేదీల మధ్యకాలంలో బ్రౌనింగ్ జూనియర్ కాలేజీ, భీమవరం నందు స్కౌట్స్, గైడ్స్ ఐదు రోజుల పెట్రోల్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించబడింది. P.M. శ్రీ పథకానికి ఎంపికైన తణుకు బాలురు ఉన్నత పాఠశాల నుండి నలుగురు బాలురు, నలుగురు బాలికలు ఈ కార్యక్రమానికి ఎంపికై శిక్షణ పొందడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థి కి ఎనిమిది మంది చొప్పున 32 మంది బాలురు 32 మంది బాలికలు గ్రూప్స్ కి పెట్రోల్ లీడర్స్ గా వ్యవహరిస్తారు.సేవా దృక్పథం, సహాయ సహకారం, మంచి అలవాట్లు పెంపొందించడం, ఏ పని చేయడానికి అయినా సంసిద్ధులుగా ఉండడం, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేటువంటి సన్నద్ధత, స్వీయ క్రమశిక్షణ, ధైర్యశీలులుగా ఉండటం, స్నేహపూర్వకంగా ఉండడం, పొదుపు అలవాట్లు అభివృద్ధి చేసుకోవడం, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండడం అంశాలుపై వీరు శిక్షణ పొందియున్నారు. తణుకు బాలురు ఉన్నత పాఠశాల నుండి ఎం. నాగరాజ్యం, గైడ్ కెప్టెన్ గా, శ్రీ కె. పాపారావు, స్కౌట్ మాస్టర్ గా వ్యవహరించిరి. వీరంతా విజయవంతంగా శిక్షణ పొంది వచ్చిన సందర్భంలో తణుకు బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.పద్మావతి, staff secretary G.j. prabhuvaram మరియు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది అభినందనలు తెలియజేసిరి. ఈ సందర్భంగా పెట్రోల్ లీడర్ టీమ్స్ ఏర్పాటు చేసి బాలురు, బాలికలకు విధివిధానాల మీద నాగ రాజ్యం, పాపారావు సలహాలు సూచనలు అందించిరి.
