మా మాట నిలబెట్టుకున్నాం

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ఆద్యంతం సినిమా హాల్లో నవ్వులు పుయిస్తుంది.

హీరో ప్రదీప్ మాచిరాజు

యాంకర్ ప్రదీప్ మాచిరాజు ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ దీపిక పిల్లి కథానాయిక. దర్శకద్వయం నితిన్-భరత్ దీనిని రూపొందించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ టూర్ నగరంలో జరిగింది. అనంతరం దశపల్ల హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ చిత్రానికి సపోర్ట్ చేసిన మహేష్ బాబు, రాంచరణ్ కి ధన్యవాదాలు చెప్పారు.ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది. ఏప్రిల్ 11వ తేదీని మా జీవితాల్లో మర్చిపోలేం. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన రోజు అది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులు నవ్వుకుంటారని మేము మాటిచ్చాం. ఆ మాట నిలబెట్టుకున్న రోజు అది. మాకెంతో సపోర్ట్ నిలిచిన డిస్ట్రిబ్యూటర్స్ కి ధన్యవాదాలు అన్నారు.. ప్రేక్షకుల ఒరిజినల్ రియాక్షన్స్ చూడాలనే ఉద్దేశంతో థియేటర్లలో దాక్కొని సినిమా చూశాం. వాళ్లు ఎంతగానో నవ్వుతుంటే మాకెంతో సంతోషంగా అనిపించింది. ఇలాంటి క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ చూసి చాలా రోజులు అయిందని వారు అంటున్నారు. ఇలాంటి కథను రాసి అందులో మమ్మల్ని భాగం చేసిన దర్శకులు నితిన్, భరత్ కి ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ” అని ప్రదీప్ తెలిపారు. నటుడు నాని త్వరలో ఈ సినిమా చూడనున్నారని ఆయన చెప్పారు. ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూసి నాని తనకు ఫోన్ చేశారని తెలిపారు. సినిమా విజయం పట్ల కంగ్రాట్స్. చెప్పారన్నారు.అనంతరం కమెడియన్ జబర్దస్త్ గెటప్ శ్రీను మాట్లాడుతూ మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించే అవకాశం కల్పించినందుకు దర్శకలకు ధన్యవాదాలు తెలిపారు సినిమా మొత్తం నాతో పాటు వెన్నెల కిషోర్ సత్య బ్రహ్మానందం గారి లాంటి సీనియర్ యాక్టర్స్ తో మేము చేసిన సీన్స్ కడుపుబ్బ నవ్వించడం తమకిఆనందాన్ని కలిగిస్తుంది అన్నారు. అనంతరం హీరోయిన్ దీపిక మాట్లాడుతూ ప్రేక్షకులు ఇంతగా ఈ చిత్రాన్ని ఆదరించడం సంతోషంగా ఉందన్నారు. దర్శకులు నితిన్-భరత్ మాట్లాడుతూ మేముస్ ఏది నమ్మి నిర్మించమో అది ఈ రోజు సక్సెస్ ద్వారా సంతోషంగా ఉందన్నారు.

Scroll to Top
Share via
Copy link