ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ.. మన రాష్ట్రానికి చెందిన మురళినాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్న పౌరసరఫరాల శాఖా మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన తణుకు పట్టణంలోని పార్టీ ఆఫీసు నందు వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు బార్ అసొసియేషన్ ప్రెసిడెంట్ అడ్వకేట్ కామేష్, వైసిపి నాయకులు సీతారాం, జల్లూరి జగదీష్, పొట్ల సురేష్, చొడే గోపి, కార్యకర్తలు పాల్గొన్నారు.
