కూటమి ప్రభుత్వం చేపట్టిన బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ మరియు ట్రైనింగ్ విషయంలో జరుగుతున్న అవకతవకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, కుట్టు మిషన్ల శిక్షణలో జరుగుతున్న భారీ స్కాం విషయమై తక్షణం సీబీ అయితే విచారణ జరిపించాలని పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా తణుకులో స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద కుట్టు మిషన్ స్కాం పైన విచారణ జరిపించి నిజాలు విగ్గు తేల్చాలని వైసిపి కార్యకర్తలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 157 కోట్ల రూపాయల కుట్టు మిషన్ స్కామ్ లో విచారణ జరిపించాలని లేనిచో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి స్కీములు లేవు గాని అన్నీ స్కాములే ఉన్నాయని అన్నారు., ఒకపక్క ప్రజలు స్కీములు లేక అల్లాడిపోతున్న, ఆరోగ్యశ్రీని గాలిక వదిలేసి, ఫీజు రీయింబర్స్మెంట్ అమ్మబడి లేకుండా ప్రజలకు అందవలసిన సొమ్ము స్కామలు ద్వారా కూటమి నాయకులు దోచుకుంటున్నారని అన్నారు. ఈ కుట్టు మిషన్ల బీసీలకు అందజేసే విషయంలో ఒక్కొక్క మిషన్ ఖరీదు హోల్‌సేల్‌గా రు.4,500, ట్రైనింగు నిమిత్తం 3000 కలిపి మొత్తం రూ. 7,500 అవుతుండగా ఈ కూటమి ప్రభుత్వం 23 వేల 500 ఖర్చు చేసిందని, మొత్తం 157 కోట్ల రూపాయల అవినీతికి కూటమి ప్రభుత్వం తెరతీసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిమాండ్ చేస్తూ తణుకు పట్టణంలో ఏమార్వోకి రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది. వైసిపి నాయకులు పెన్మత్స సుబ్బరాజు, రుద్ర ధనరాజు, కోట నాగేశ్వరరావు, పోట్ల సురేష్, మెహర్ అన్సారి, సీతారాం, జల్లూరి జగదీష్, నూకల కనకదుర్గ, తదితరులు పాల్గొన్నారు.
