దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఎన్. సుజాత ఆదివారం సింహాచలం దేవస్థానం ఇ. ఓ. (FAC) గా ఛార్జ్ తీసుకున్నారు. సింహాచలం దేవస్థానం ఈవోగా నియమించిన సుజాత మొదటిగా అప్పన్నస్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి నక్కాన ఆనంద్ కుమార్ ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు సాదర స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభం ఆలింగనము తదుపరి బేడా ప్రదక్షణ చేయించి స్వామి వారి దర్శనము అనంతరము వేద పండితులు వేద ఆశీర్వచనము ఇచ్చారు. అనంతరము స్వామివారి పటము ప్రసాదాలను ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి ఆనంద్ కుమార్ అందించారు. ఈ కార్యక్రమంలో వైదిక సిబ్బంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డివి రామరాజు ఆలయ పర్యవేక్షకులు జి.వి.ఎస్. కే ప్రసాద్, కంచి మూర్తి తదితరులు పాల్గొన్నారు.
