తణుకు పట్టణంలో శ్రీ రామకృష్ణ సేవాసమితి, సజ్జాపురంలో వేసవి సెలవులను సద్వినియోగ పరచుకునే విధంగా చిన్నారులకు గత పది రోజులుగా జరుగుతున్న వేసవి శిక్షణాశిబిరంలో ప్రముఖ సైంటిఫిక్ మెజీషియన్, సైకాలజిస్ట్, మోటివేషనల్ ట్రైనర్ బాపతు మదన గోపాలరెడ్డి (గోపి మామ) నీటితో మంటలు, కంటి చూపుతూ మంటలు, కొబ్బరికాయపై మంటలు, శక్తి మార్పిడి, ఘర్షణ అభికేంద్రబలం, ఆపరేషన్ సింధూర్ మొదలైన విషయాలు ప్రయోగాలు చేసి వివరించారు. ఈ ప్రయోగాలు విద్యార్థులలో మూఢ నమ్మకాల గురించి అవగాహన కల్గిస్తాయనీ, శాస్త్రీయ వైఖరి నెలకొల్పడానికి, సైన్స్ పట్ల ఆకర్షింపచేయడానికీ, దేశభక్తి పెంపొందించడానికి దోహదం చేస్తాయని గోపాలరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి కో ఆర్డినేటర్స్ గిరీశ్వరరావు, అక్కింశెట్టి రాంబాబు, ఎన్. రామకృష్ణ , మహేష్, లోహిత, తేజోమయి, సాయినాధ్ రెడ్డి, ఇందిర, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
