తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు
కిరాణా వర్తక సంఘం భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ చదువుకోలేని స్థితిలో ఉన్న పేద విద్యార్థులను దాతలు దత్తత తీసుకుని వారి ఉన్నతికి తోడ్పడాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం తణుకులో నూతనంగా నిర్మించిన కిరాణా వర్తక సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉన్నత స్థానంలో సమాజంలో కొనసాగుతున్న వారు పేదలకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలబడాలని ఉద్దేశంతో ప్రభుత్వం పి 4 విధానాన్ని అమలు చేస్తుందని చెప్పారు. కిరాణా వర్తక సంఘం సభ్యులు ఐక్యంగా ఉంటూ నిధులు సమకూర్చుకొని ఒక భవనాన్ని నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు ఇదే రీతిగా సభ్యులు పేద విద్యార్థులను దత్తత తీసుకోవాలని కోరారు. సంఘ భవనం ద్వారా వచ్చే ఆదాయాన్ని సభ్యుల ఆర్థిక అభివృద్ధికి ఖర్చు చేసే విధంగా ప్రణాళికలు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. చిన్న స్థాయిలో వ్యాపారాలు, వ్యాపారస్తుల ఆర్థిక అభివృద్ధికి సంఘం కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా వ్యాపారులు సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ ను నిషేధించి తణుకులో ప్లాస్టిక్ నిషేధానికి సంపూర్ణ సహకారం అందించాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు రెడ్డి వీరన్న, కార్యదర్శి కోర్లేపర సత్యనారాయణ, కోశాధికారి శంకర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.