“ఎండియు” వ్యవస్థను అడ్డుపెట్టుకొని అక్రమాలు

గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం దోపిడీ

కూటమి ప్రభుత్వ హయాంలో తిరిగి రేషన్ దుకాణాలు

రూ. 380 కోట్లు ఆదా లక్ష్యంగా ఎండియు వ్యవస్థ రద్దు – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

ఎండియు వ్యవస్థను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వ హయాంలో వైసిపి నేతలు రూ. వేల కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. ఇంటింటికి రేషన్ బియ్యం పేరుతో ప్రజా పంపిణీ వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాలను తిరిగి పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో తణుకు నియోజకవర్గంలోని రేషన్ డిపో డీలర్లతో శుక్రవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థను వైసీపీ నాయకులు సొంత వ్యవస్థలులాగా వాడుకుని రీసైకిలింగ్ చేసి బియ్యాన్ని విదేశాలకు తరలించే వారని అన్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమ మార్గంలో తరలించేందుకు విరిగా వైసిపి నేతలు ఎండియు వాహనాలను ప్రవేశపెట్టారని విమర్శించారు. ఎండియు వాహనాల ద్వారా కనీసం 20 శాతం మందికి కూడా రేషన్ బియ్యం సకాలంలో అందేవి కావని అన్నారు. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను సమీక్షించే దాదాపు ఏటా రూ. 380 కోట్లు మేర ఆదా లక్ష్యంగా తిరిగి రేషన్ షాపులను ప్రారంభించినట్లు చెప్పారు. 65 సంవత్సరాలు దాటిన వారితోపాటు దివ్యాంగులకు వారి ఇంటికి రేషన్ బియ్యాన్ని అందించడానికి ప్రణాళికలు చేసినట్లు చెప్పారు. మిగిలిన వారంతా తమకు దగ్గరలో ఉన్న రేషన్ షాపులకు వెళ్లి బియ్యంతో పాటు ఇతర సరుకులు తీసుకోవచ్చని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సులువైన మార్గంలో ప్రతినెల ఒకటి నుంచి 15 వరకు అందుబాటులో రేషన్ షాపులు ఉంటాయని చెప్పారు. అర్హులైన పేద ప్రజలకు రేషన్ బియ్యం త పాటు రేషన్ సరుకులు సకాలంలో అందించాలనే లక్ష్యంతో ఓటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు.

Scroll to Top
Share via
Copy link