తణుకు మునిసిపల్ కార్యాలయ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్

తణుకు మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంనందు నిర్వహించిన ప్రజల సమస్యల ప్రజాదర్బార్ కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొనడం జరిగింది,ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భారత ప్రధాని మోడీ సహకారంతో ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ముందుకు వెళుతున్నదని అన్నారు. గత ఐదు సంవత్సరాలలో జగన్ ప్రభుత్వంలో అందరూ కూడా ఎన్నో బాధలతో మిగిలినారు, జగన్ ప్రభుత్వం అసమర్థత పాలన వల్ల ప్రజలు అనేక మోసాలకు గురై, భూ ఆక్రమణలకు గురై ప్రభుత్వ సంక్షేమం కావచ్చు అనేక విధాలుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అటువంటి బాధితులుగా ఉన్న ప్రజలసమస్యలు తెలుసుకుని వారికి తక్షణమే పరిష్కారం మార్గంగా ఈ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ప్రజాదర్బార్ కార్యక్రమం చేపట్టి తణుకు నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేపట్టినదని అన్నారు. ఈ ప్రజాదర్బారులో వచ్చిన ప్రజల సమస్యలను సంబంధిత అధికారిని క్షుణ్ణంగా పరిశీలించి వారికి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చినారు. మరలావచ్చే సంవత్సరంలో ఈ ప్రజాదర్బార్ నిర్వహించి గత ప్రజాదర్బార్ లో వారి సమస్యలకు ఎటువంటి పరిష్కారం చూపించారని ప్రతి అర్జీదారుకి జవాబిదారితనంగా ఉండే విధంగా ఉండాలని అన్నారు. ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి 300 అర్జీలు వచ్చినవి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు ప్రభుత్వ అధికారులు మున్సిపల్ సిబ్బంది ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link