స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెల మూడవ శనివారం గ్రామపంచాయతీలలో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కొరకు చేపడుతున్న పారిశుద్ధ్యం, నీరు చెట్టు, మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు దమ్మెన్ను గ్రామంలో.. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గురజర్ల సత్యనారాయణ అధ్యక్షత వహించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయితీ ఆఫీసు దగ్గర యోగాభ్యసన కార్యక్రమం నిర్వహించారు. సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా పంచాయతీ ఆవరణలో కొబ్బరి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రామకృష్ణ, బిజెపి నాయకులు చీమకుర్తి లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
