బాలలసదనంలో వైద్యపరీక్షలు, అవగాహన కార్యక్రమం

పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు తణుకు పట్టణంలో శనివారం జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సదనం నందు తణుకు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి యందు గల జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రంలో వైద్య సిబ్బంది బాలల సదనంలో ఆశ్రయం పొందుతున్న బాలలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేయడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్య సంరక్షణ పై సలహాలు మరియు సూచనలు ఇవ్వడం జరిగిందని జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ ఆర్ ఎం.ఓ తెలియజేశారు.

Scroll to Top
Share via
Copy link