సాగర తీరం సాక్షిగా నగర అందాలకు పట్టాభిషేకం జరగబోతోంది. ఈ ఏడాది మిస్ & మిసెస్ వైజాగ్ 2025 పోటీలు ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఎలైట్ మోడల్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకులు సిద్ధం అయ్యారు. ఈ సందర్భంగా విశాఖలోని ఒక ప్రయివేటు హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఎలైట్ మోడల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్స్ అయిన జబర్దస్త్ ఫేమ్ రింగ్ రియాజ్ మరియు షేక్ సుబాషన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో మోడల్ రంగంలో రాణించాలని ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు అన్నారు అందాల పోటీల్లో జిల్లా వారిగా రాష్ట్రల వారిగా దేశాల వారిగా ప్రపంచ స్థాయి గా తీసుకెళ్లాడమే ఎలైట్ మోడల్ ఇనిస్టిట్యూట్ అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు..ఈ పోటీల్లో పాల్గొనడానికి నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా యువతులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పోటీలు కేవలం అందానికి మాత్రమే కాకుండా, ప్రతిభ, తెలివితేటలు, సామాజిక స్పృహ, మరియు ఆత్మవిశ్వాసానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు.. ఈ పోటీల్లోని ప్రధాన రౌండ్లు గా సాంప్రదాయ దుస్తుల ప్రదర్శన , భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులతో పోటీదారులు ర్యాంప్ వాక్ చేస్తారన్నారు. టాలెంట్ రౌండ్, నృత్యం, పాటలు, వంటి తమ కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తారని మోడ్రన్ ఫ్యాషన్ రౌండ్ లో భాగంగా ఆధునిక ఫ్యాషన్ దుస్తులతో తమ స్టైల్ మరియు ఆత్మవిశ్వాసాన్ని చూపుతారన్నారు. ఈ సువర్ణావకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మిసెస్ ఆంధ్ర 2024 స్నేహ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈవెంట్ పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో హసీనా, యశస్విని పగడాల, లోహిత, సన, మంజిల్ ఆరా మోడల్స్ పాల్గొని ర్యాంపు వాక్ చేశారు. ఈ అందలపోటీలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ఎలైట్ మోడల్ ఇనిస్టిట్యూట్ పేజ్ లో తమ డిటైల్స్ ఇవ్వాలన్నారు. మరిన్ని వివరాలకు
8331832838, 8522994737 ఈ నెంబర్స్ లో సంప్రదించాలన్నారు
