సేవా కార్యక్రమాల్లో భాగంగా “అవర్ హ్యాండ్స్” సంస్థ ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను పేదలు, అనాథలు అవసరమైనప్పుడు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఉచిత అంబులెన్స్ సేవలను పునీత పేతురు ప్రధాన చర్చ్ విచారణ కర్తలు ఫాదర్ జొన్నడ జాన్ ప్రకాష్, తెలుగుదేశం పార్టీ మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షుడు ఐతి రవిబాబు ఆదివారం ప్రారంభించారు. అవర్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకుడు పిల్లి గోవిందరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఆర్థికంగా వెనుకబడినవారికి ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం” అని తెలిపారు.
