జూలై 1 న సీఎం పర్యటన నేపథ్యం లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో సభాస్థలిని స్వయంగా పరిశీలించి ప్రజాప్రతినిధులకు , అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి కందుల దుర్గేష్

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సూచన

జూలై 1 వ తేదీన కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ ఆర్డీవో కార్తీధాత్మసభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ చినరాముడు, రాజమండ్రి ఆర్డీవో కృష్ణనాయక్, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, అదనపు ఎస్పీ ఎమ్. మురళీకృష్ణ , డీఎస్పీ జి.దేవకుమార్ తదితర జిల్లా పోలీస్ యంత్రాంగంతో ఏర్పాట్లపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు, స్థానిక కూటమి నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలు బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించాలని, కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేయాలని మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు. సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లు,హెలిప్యాడ్, రూట్ మ్యాప్, ఇతర ఏర్పాట్లు చేయాలని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని మంత్రి దుర్గేష్ సూచించారు.

Scroll to Top
Share via
Copy link