తణుకు మండలోని గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు ఉద్యాన సహాయకులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయము మరియు వ్యవసాయ స్కీముల పైన అవగాహనా కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమములో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎంవి రమేష్ మాట్లాడుతూ సిబ్బంది అందరు వ్యవసాయ స్కీము ల మీద పూర్తి అవగాహనా కలిగి ఉండాలి అని సూచించారు. ప్రకృతి వ్యవసాయ డిపిఎం నూకరాజు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యత మరియు పురుగు మందులకు బదులు జీవన ఎరువులు ఏ విధంగా రైతులు వాడాలి అని కులాంకాషంగా వివరించారు. మండల వ్యవసాయధికారిని కుసుమ గా మాట్లాడుతూ సి ఎల్ ఎస్ యాప్ అనేది చాలా ముఖ్యమైంది అని దానిలో ఏ విధంగా ఫీల్డ్ కి వెళ్లి పంటల యొక్క దశ మరియు పురుగు మరియు శీలింద్రాలు ఏవి ఆశించినవి అనేవి న్యూట్రియన్ డిఫియన్సీ ఎలా అప్డేట్ చేయాలి యాప్ లో థ్రె షోల్డ్ లెవెల్ ఈటీఎల్ పై అవగాహనా కల్పించారు. ఈ కార్యమములో వ్యవసాయ సిబ్బందితో పాటు రైతులు కూడా పాల్గొన్నారు.
