ట్రూ అప్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపరాదు

ట్రూ అప్ పేరుతో ప్రజలపై వేసిన 6072కోట్ల కరెంట్ బారాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహారించు కోవాలని CPM పట్టణ కార్యదర్శి పీవీ. ప్రతాప్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక వై జంక్షన్ వద్ద ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా మరియు విద్యుత్ పెంపుదల ప్రతులను దగ్ధం చేయడం CPM ఆధ్వర్యంలో జరిగింది. ట్రూ అప్, ఇందన సర్దుబాటు పేరుతో ప్రజలు పై బారాలు వేయడం ఆపాలని, కూటమి హామీలు మేరకు గత ప్రభుత్వం పెంచిన బారాలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు పెట్టడం ఆపాలని, ప్రభుత్వమే ట్రూ అప్ బారాన్ని భరించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ప్రతాప్ మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన నాలుగు నెలలకే 6072కోట్లు ప్రజలపై వేయడం బాధాకరం అన్నారు. ఎన్నికలలో చెప్పిన దానికి నేడు జరుగుతున్న పాలనకు చాలా తేడా ఉన్నదని విమర్శించారు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డిజిల్, గ్యాస్, కూరగాయలు, ఉప్పు పప్పు, వంట నూనె ధరలు ఆకాశానంటుతున్నాయని అన్నారు.ఇప్పుడు కరెంట్ భారంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉందన్నారు. పెంచిన ధరలు తగ్గించాలని లేకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గార రంగారావు, చిన్న, సూరిరావు, కృష్ణ, రాంబాబు, శివ, అనిల్, అప్పన్న, రాము, నర్సింహామూర్తి, రమేష్, సురేష్, సాయి, శ్రీను, శివసాయి, పెంటయ్య, రమణ, లక్ష్మణ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link