పిడుగుపాటే వారికి శాపం అయింది

అందరి జీవితాల్లో వెలుగులు చిమ్మే దీపావళి పండుగ వారి జీవితాలలో నిండు అమావాస్యను మిగిల్చింది. తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం,  సూర్యారావుపాలెం, కాల్దారి రహదారి ప్రక్కన కొబ్బరి చెట్టుపై పిడుగు పాటుకు బుధవారం ఆ ప్రాంతంలో ఉన్న దీపావళి బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమై పోగా, ఇద్దరు మహిళలు మృతి చెందారు, ఇద్దరిలో ఒకరు యజమాని భార్య కావడం ఒక విషాదమైతే,  ఐదుగురికి తీవ్ర గాయాలు, పలువురు పాక్షికంగా క్షతగాత్రులైనట్లు   ప్రాథమిక సమాచారం.  సాయంత్రం ఐదు గంటల అనంతరం జరిగిన ఈ సంఘటనతో యావత్ మండల ప్రజలు ఒక్కసారిగా షాక్ తిన్నారు.  కొంతకాలంగా జనావాసాలకు దూరంగా, వ్యవసాయ భూముల మధ్యలో  దీపావళి బాణాసంచా తయారీ కేంద్రం కొనసాగుతోంది. పొట్టకూటికోసం అనేకమంది ఆ కేంద్రంలో పనిచేస్తుంటారు.  గురువారం దీపావళి పండుగను పురస్కరించుకుని, బాణాసంచా తయారీ లో నిమగ్నమైన వారికి పిడుగు పాటు నుండి తప్పించుకునే సమయం కూడా లేకపోవడంతో అశువులు బాసారు.  ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో హఠాత్తుగా పక్కనే ఉన్న కొబ్బరిచెట్టు పై పిడుగు పడటం, దాని నుండి బయటపడిన నిప్పురవ్వలు ఈ తయారీ కేంద్రంపై పడగా ఈ విషాదం నెలకొంది. పిడుగుపాటు నుండి తేరుకునే లోపు ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పదిమంది వరకు గాయాలపాలయ్యారు.

Scroll to Top
Share via
Copy link