పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం రేలంగి చుక్కావారితోట గ్రామంలో మొక్కలు నాటి కార్యక్రమం మండల టిడిపి అధ్యక్షులు గూడూరి నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ex -zptc జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపుమేరకు మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, రాష్ట్రంలో వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి కోటి మొక్కలను నాటాల అన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వరాజ్యం, టిడిపి పార్టీ సెక్రటరీ కామన రాంబాబు, జనసేన అధ్యక్షులు పసుపులేటి అబ్బులు, సెక్రెటరీ మంగిన శ్రీను, ఎక్స్ ఎంపీటీసీ కామన ఏడుకొండలు, సిరిగినీడి గాంధీ, సుబ్రహ్మణ్యం, గుడాల శ్రీనువాసు, పసుపులేటి నాగన్న, కామన అంజి, నాగేశ్వరరావు మరియు కూటమి నాయకులు ప్రభుత్వ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
