రైతులకు గిట్టుబాటు ధరను ప్రభుత్వము ప్రకటించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జుత్తిగ నరసింహామూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఇరగవరం మండలo ఆరో మహాసభ రేలంగి గ్రామంలో అమర జీవులు బొంత్తు సత్యనారాయణ మరియు జోగి సాక్షి స్మారక ప్రాంగణములో ఇల్లందుపర్తి సత్యనారాయణ అధ్యక్షన శనివారం నాడు జరిగినది. ఈ మహాసభలో నరసింహమూర్తి మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్న మంచి ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకుంటుందని ఇప్పటివరకు రైతుల యొక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర ప్రకటించకపోవడం సిగ్గుచేటని అన్నారు. కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని రైతులు తూసే ధాన్యము ల్లో మోసాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ప్రజల పక్షాన పోరాడు ప్రజా సమస్యలను పరిష్కారం కోసం కృషి చేసిన అన్నారు. కేంద్ర ప్రభుత్వం మతంపై పరిపాలన సాగిస్తుందని దానికి రాష్ట్రంలో కూటమీ ప్రభుత్వం మద్దతు పడుతుందని అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా సెక్రెటరీ సభ్యులు పీ.వీ. ప్రతాప్ మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలు అనేక సమస్యలపై సతమతమవుతున్నారని వీటిని పాలకులు గాలికి వదిలి వేసినారు అని అన్నారు. ప్రజలంతా సిపిఎం పార్టీ వైపు ఎదురుచూస్తుందని ఇటువంటి సమయంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు ప్రజల పక్షాన పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పేరుతో ప్రజలను సోమరిపోతులను పాలకులు చేస్తున్నారని దీన్ని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలను 6,111 వేల కోట్లు పెంచిందని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన అని పట్టించుకోవటం లేదని అన్నారు. దీనికి సిపిఎం పార్టీ ప్రజా పోరాటాలకు నడుం బిగించాలని ప్రతాప్ పిలుపునిచ్చారు. మహాసభలో ప్రారంభ జెండా ఆవిష్కరణ సీనియర్ పార్టీ కామ్రేడ్ జన్ని మహాలక్ష్మి జెండా ఎగురవేయగా అమరవీరులు సీతారాం ఏచూరి పుచ్చలపల్లి సుందరయ్య, సీతారాం ఏచూరి, ఆర్. సత్యనారాయణరాజు స్థానిక నాయకులు జోగి సాక్షి తదితరులకు సభ నివాళులు అర్పించింది. ఈ సభలో సిపిఎం పార్టీ జిల్లా సెక్రెటరీ సభ్యులు కేతా గోపాలం కూడా మాట్లాడినారు. సభలో మండల కన్వీనర్ కామన మునిస్వామి గత మూడు సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ మండలంలో చేసిన కార్యక్రమాలను రిపోర్టును సభలో వివరించారు. ఈ సభలో స్థానిక నాయకులు ఆంజనేయులు జోగి సత్యనారాయణ, జోగి సాయి, దంపనబోయిన విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.