ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సి. నారాయణరెడ్డి జయంతిని సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యందు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అక్షరాన్ని నడిపించడం ఆయనకు ఇష్టం, సాహిత్యం అంటే ప్రాణం అని అన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కందుకూరి పద్మావతి మాట్లాడుతూ తెలుగు భాషకు సుగంధం తెచ్చి జాతీయస్థాయిలో తెలుగు సాహిత్య కీర్తిని చాటిన వ్యక్తి డాక్టర్ సి.నారాయణరెడ్డి అని అన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత తెలుగు ఉపాధ్యాయురాలు నంబూరి జానకి మాట్లాడుతూ సానదీసిన వజ్రం జాతిరత్నం సి.నా.రే అని అన్నారు. డాక్టర్ సి. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ఆయన రచించిన సినీగీతాలపై పోటీలు నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చింతపల్లి దుర్గాప్రసాద్, కాయల సోమేశ్వరరావు, నాగరాజు వెంకటరాజు, తురగా వెంకట సత్య భాస్కర్, కేశవరపు పాపారావు, వెదురువాడ నరేంద్రనాథ్ ఉపాధ్యాయులు గురజుబెల్లి మాధవిలత, కొడవటి రాధ, ఆలపాటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
