సామాజిక న్యాయ శిల్పం నిర్వహణ ఏది..!!

రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా.అంబేడ్కర్ కు ఇచ్చే గౌరవం ఇదేనా..!?

ఎన్నికల ముందు వాడవాడల్లో అంబేడ్కర్ సిద్ధాంతాలు ఆయన గొప్పలు చెప్పుకుంటూ గద్దెనెక్కిన నాయకులు ఎక్కడా..??

నిర్మాణం ఏ ప్రభుత్వంలో జరిగితే ఏంటి..!?

శుద్ధి శుభ్రం లేకుండా అలా గాలికి వదిలేస్తారా..!?

లోపల ప్యాన్లు,ఏసీ లేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న పరిస్థితి..

సరైన నిర్వహణ లేక దుమ్ము కొట్టుకుని పోతున్న సామాజిక న్యాయ శిల్ప ప్రాంగణం..

టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండటం ఆడవాళ్లు కనీసం అటు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు..

చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లుగా… ఆయన రాజ్యాంగం ద్వారా చట్ట సభల్లో కూర్చున్న నాయకులు, నేడు గౌరవమర్యాదలు అనుభవిస్తున్న నాయకులు సైతం మూగబోయారా..!?

రోజుకి కొన్ని వందల మంది చిన్నారులు విద్యార్థులు కొన్ని వందల కుటుంబాలతో సామాజిక న్యాయ శిల్పం సందర్శనార్థం వస్తున్నారు..

గత ప్రభుత్వంలో నిర్మాణం జరగడంతో నేడు నిర్లక్ష్యంగా వదిలేశారా..!? ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

యోగాసనాలు, ప్రభుత్వ ప్రకటనలకు కొన్ని అనవసరమైన వాటికి కొన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి ప్రభుత్వం నగరం నడి ఒడ్డులో ఉన్న విగ్రహం నిర్వహణ గాలికి వదిలేశారు..

ఆ ప్రభుత్వం చేసిన దాని కంటే రెండు రేట్లు ఎక్కువగా అభివృద్ధి నిర్వహణ చేసి ప్రజల మన్ననలు పొందాలే గానీ, కక్ష సాదింపులకు ఇది మార్గం కాదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు…

బ్రతికి ఉండగా అనేక వివక్షలకు గురై గొప్ప రాజ్యాంగం అందించిన అంబేడ్కర్ నేడు చనిపోయాక రాజకీయాల మధ్య మరొక సారి చనిపోతున్నారని భావిస్తున్నారు..

స్మృతివనంలో నిర్వహణ లోపించడంతో సందర్శించడానికి వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు..

కొన్ని కోట్ల ప్రజలకు ఆరాధ్య దైవం అంబేడ్కర్..

ఇంతే అశ్రద్ధ అన్ని విషయాలలో జరుగుతోందా అని ప్రశ్నిస్తున్నాయి..

బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలు జ్ఞానానికి ప్రతీకలు…

అంటరానితనం అస్పృశ్యత వంటి అనేక వివక్షలకు గురై గొప్ప గొప్ప చదువులను అభ్యసించి ప్రపంచ దేశాల్లో అన్నింటికన్నా మహోన్నతమైన రాజ్యాంగాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్…

నేటి సమాజానికి భావితరాలకు స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేడ్కర్..

నేడు..!!

ఏదైతే అమరావతి రాజధాని, విజయవాడ మహా నగరమని గొప్పలు చెప్పే ప్రభుత్వాలు సిగ్గుపడేలా ఉంది న్యాయ శిల్ప ప్రాంగణం..

అమరావతి రాజధానికి కూతవేటు దూరంలో ప్రభుత్వ కలెక్టర్ కార్యాలయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గృహం..

విజయవాడ ప్రధాన రహదారి మార్గంలో ఇంత దారుణం జరుగుతున్నా పట్టించుకోక పోవడం పట్ల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు..

విద్యార్థిని, విద్యార్థులు న్యాయ శిల్పంలో ఉన్న అంబేద్కర్ జీవిత చరిత్రను జ్ఞానవంతమైన విషయాలు చదువుకుని తెలుసుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది..

నిర్వహణ లోపించడంతో లోపల ఉన్న మోనిటర్లు
లైట్లు ఆగిపోయాయి వాటర్ ఫౌంటైన్స్ పాకుడు పట్టడంతో మురికి కాలవ మాదిరిగా దుర్వాసన వస్తున్నాయి..

ఆయన ఎక్కడ ఉన్నా రాజకీయాలకు అతీతంగా అధికారులు, పాలకులు మంచి నిర్వహణ చేయాలని కోరుతున్నారు..

Scroll to Top
Share via
Copy link