ఆగస్టు 11 సోమవారం – పీజీఆర్ఎస్ కార్యక్రమం యథాతధంగా

ఆగస్టు 11 సోమవారం – పీజీఆర్ఎస్ కార్యక్రమం యథాతధంగా

1100 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదుల పరిష్కార వేదిక

9552300009 వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందుబాటులో

  • కలెక్టర్ పి ప్రశాంతి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార) కార్యక్రమం ఈ నెల ఆగస్టు 11వ తేదీ సోమవారం యథావిధిగా నిర్వహించబడుతుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా స్థాయిలో జరుగుతున్న పీజీఆర్ఎస్‌లో ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల కేంద్రాల కార్యాలయాల్లోనే సమర్పించవచ్చని తెలిపారు. జిల్లా కేంద్రానికి ప్రత్యేకంగా రావాల్సిన అవసరం లేకుండా స్థానికంగా అధికారులు సేవలు అందిస్తారని, దీని వల్ల ప్రజలకు సమయం మరియు ఖర్చు ఆదా అవుతుందని చెప్పారు.

అర్జీల స్వీకరణ ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు జరుగుతుంది. ప్రజలు “మీ కోసం” 1100 కాల్ సెంటర్ ద్వారా కొత్త ఫిర్యాదులు నమోదు చేయడంతో పాటు, ఇప్పటికే నమోదు చేసిన ఫిర్యాదుల పరిష్కార స్థితిని కూడా తెలుసుకోవచ్చని తెలిపారు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 ద్వారా పౌర సేవలు పొందవచ్చని, ఈ నంబర్‌ను తమ సెల్‌ఫోన్లలో సేవ్ చేసుకోవాలని సూచించారు.

నేరుగా హాజరు కాలేకపోయిన వారు meekosam.ap.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అర్జీలు నమోదు చేసుకునే వీలుందని తెలిపారు. ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న ఈ వినూత్న మాధ్యమాలను ఉపయోగించి తమ సమస్య లను పరిష్కరించు కోవాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు.

Scroll to Top
Share via
Copy link