చిలకలూరిపేట నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్న విడదల రజనీ తప్పుడు కేసులు గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. మంగళవారం సాయంత్రం నవతరం పార్టీ చిలకలూరిపేట కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడుతూ గతంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పైన మహిళా అధికారిణితో తప్పుడు ఎస్సి కేసు పెట్టించిన విషయం మరచిపోయావా అని ప్రశ్నించారు. శారద హైస్కూల్ ఎస్టీ ప్రధానోపాధ్యాయురాలు లు, ప్రభుత్వ ఆసుపత్రి మహిళా వైద్యురాలు,విద్యా శాఖ ఎస్టీ మండలం అధికారిణి, మండలం ఎంపిడివో ని వేధించిన విడదల రజనీ మాట్లాడటం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అన్నారు. యడవల్లి రైతులకు, ఇంకా మురికిపూడి, రాజాపేట, బొప్పూడి రైతులకు చేసిన అన్యాయం మరచిపోకు రజని అని అన్నారు. చిరుమామిళ్ల గ్రామంలో ఎస్సి మహిళ అధికారిణి స్వరూపరాణి కి అండగా నిలవాల్సిన నువ్వు ఆమెను బెదిరింపులు గురి చేసిన వైస్సార్సీపీ నేతకు అండగా నిలవడం తప్పు కాదా అని అన్నారు. చిలకలూరిపేటలో నవతరంపార్టీ కార్యాలయంపైన, జెండా పైన, రావు సుబ్రహ్మణ్యం ఇంటిపైన దాడి చేయించిన నేపథ్యంలో మా అమ్మ నీ వల్లే పక్షవాతానికి గురై చనిపోయారు అని ఆమె ఉసురు నీకు తగిలే అడ్రెస్ లేకుండా పోయావని రావు సుబ్రహ్మణ్యం అన్నారు.వైస్సార్సీపీ సోషల్ మీడియా నుండి బూతులు తిడుతుంటే పోలీసులు చూస్తూ కూర్చోవాలా అని అన్నారు. రజని ఆమె మరిది, అనుచరులు పైన డిజిపి కి పిర్యాదు చేస్తామని తెలిపారు. గతంలో ఎస్సి తెలుగుదేశం యువనేత పిల్లి కోటి,బిసి నేత బాలాజీ సింగ్ ని కొట్టించి లైవ్ వీడియో చూసిన నువ్వు కూడా తప్పుడు కేసుల గురించి మాట్లాడటం మానుకోవాలని విడదలరజని కి రావు సుబ్రహ్మణ్యం హితవు పలికారు.