తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బార్ అసోసియేషన్ ఆవరణలో డా.బి.ఆర్. అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయం అన్నారు.రాజ్యాంగ ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్ధ పరిరక్షణకు ప్రతీఒక్కరూ కృషి చేయడం ద్వారా అంబేద్కర్ ఆశయ సాధనకు పూనుకోవాలన్నారు, ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి. అంబిత్, ఈదా రామకృష్ణ, ఎం. సాంసన్, పోట్ల విజయ్, సి.హెచ్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.