దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గొప్ప దార్శనికుడని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తణుకు ఎన్టీఆర్ పార్క్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా భీమారావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మతతత్వ పాలనతో రాజ్యాంగానికి తీవ్ర ముప్పు ఏర్పడిందన్నారు. సమాజాన్ని ముక్కలుగా చీల్చి, సామాజిక అసమానతలకు పునాదులు వేసే మనుస్మృతి అమలుకు బిజెపి పూనుకుంటుందన్నారు. రాజ్యాంగ ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్ధ పరిరక్షణకు ప్రతీఒక్కరూ కృషి చేయడం ద్వారా అంబేద్కర్ ఆశయ సాధనకు పూనుకోవాలన్నారు.
సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, సీపీఐ నాయకులు బొద్దాని మురళి కృష్ణ నూనె రాధాకృష్ణ, నుడగల అప్పారావు కొమరాపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.