పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం తేతలి గ్రామ పరిధిలో, సత్యవాడ రోడ్లో సివిల్ సప్లై ఆనుకుని ఏర్పాటుచేసిన లేహం ఫుడ్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అను సంస్థ 2013 నుండి స్వార్థ ప్రయోజనాల కొరకు చట్ట వ్యతిరేకంగా ప్రజా ఆరోగ్యానికి భంగం కలిగేవిధంగా, అశాంతికి గురిచేసి దేశాన్ని మన గ్రామాలను విచ్ఛిన్నం చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారని రామరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కొండ్రెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తణుకు పట్టణంలో సజ్జాపురంలో శనివారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థకు ప్రభుత్వంలోని వివిధ శాఖల పరిధిలో చట్టాల పైన సెక్షన్ల పైన అవగాహన కలిగిన అధికారులు స్వార్థ ప్రయోజనాల కొరకు చట్టాలను ఉల్లంఘించి దేశద్రోహానికి పాల్పడుతున్న లేహం ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆయా ప్రభుత్వ శాఖల నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు ఇచ్చి ఆ సంస్థ కార్యకలాపాలు ద్వారా ప్రకృతిని విచ్ఛిన్నం చేసి ప్రజలకు అనారోగ్యాన్ని ఆర్థిక ఇబ్బందులను అశాంతిని కలిగించడానికి కారకులవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రక్షించవలసిన ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం చేత ఇటువంటి సంస్థలు ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న రామరాజ్యం (కలి ధర్మస్థాపన కొరకు) అష్టదిక్పాలకులలో ఒకరైన కొండ్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థకు వివిధ ప్రభుత్వ శాఖల నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఆయా శాఖల అధికారులు వారి వారి స్వార్ధ ప్రయోజనాల కొరకు తేతలి గ్రామ ప్రజలు పరిసర ప్రాంత గ్రామాలైన చివటం, వడ్లూరు సత్యవాడ, గ్రామాల పంచాయతీల తీర్మానాలకు వ్యతిరేకంగా తణుకు పట్టణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థ వ్యతిరేక చర్యలకు అనుమతులు ఇచ్చిన వివిధ ప్రభుత్వ సంస్థలకు వెళ్లి ఆయా శాఖల ప్రతినిధులను కలసి వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ఇచ్చిన అనుమతులు 2014 నుండి నేటి వరకు ప్రశ్నిస్తూ తప్పుడు అనుమతులను రద్దు చేయిస్తూ కొన్ని శాఖల అధికారుల నిర్లక్ష్యాన్ని గౌరవ హైకోర్టు వారి దృష్టికి తీసుకువెళ్లి హైకోర్టు ఉత్తర్వుల ద్వారా దేశద్రోహులైన లేహం సంస్థ కార్యకలాపాలను నిలుపుదల చేయించామని తెలిపారు. ప్రస్తుతం మరల ఆ సంస్థ తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ చట్ట ప్రత్యేకంగా చట్ట వ్యతిరేకంగా గోవులను గేదెలను వధిస్తూ ప్రజాసంఘాలు, గో భక్తులు, మనోభావాలు దెబ్బతినకుండా లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థ కార్యకలాపాల నిలుపుదలకై విశ్రమించకుండా పోరాడుతామని తెలియజేశారు. అదేవిధంగా శ్రీ శ్రీ రాజేష్నాథ్ అఘోర మాట్లాడుతూ మనం పుట్టి పెరిగిన నేల మన కళ్ళముందే నాశనం అవుతుంటే …. రేపటి భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే భరోసా ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోవాలని, మన తణుకు మన ప్రాంతాన్ని మనమే కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ప్రజలలో ఆ సంస్థ కార్యకలాపాలపై చైతన్యం కల్పించి, ప్రజల హక్కులకై పోరాటం చేస్తామని అన్నారు. అదేవిధంగా లేహం పరిశ్రమకు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తాము ఈ సంస్థ ద్వారా వస్తున్న వ్యర్థ పదార్థాల వల్ల తీవ్ర అనారోగ్యాల పాలిట గురవుతున్నామని ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు, వృద్దులు నివసిస్తున్నారని, సంస్థ నుండి వస్తున్న దుర్వాసన వల్ల అనేక వ్యాధులకు గురువుతున్నామని ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించి సంస్థ కార్యకలాపాలను నిలుపుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్తిరాజు సత్తిరాజు వెంకట సుబ్రహ్మణ్యం, కొండ్రెడ్డి శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ సభ్యులు చంద్రశేఖర్, శ్రీనివాస్ రాజా, బి.శ్రీనివాస్, గంధం సురేష్ బాబు, తణుకు గో సేవాసమితి సభ్యులు పసుపులేటి సూరి పండు తదితరులు పాల్గొన్నారు.